ministry of defence: భారత రక్షణ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన చైనీయులు

  • కాసేపటి క్రితం హ్యాకింగ్ కు గురైన వెబ్ సైట్
  • సైట్ ఓపెన్ చేయగానే కనిపిస్తున్న ఎర్రర్ మెసేజ్ 
  • స్క్రీన్ పై కనపడుతున్న చైనీస్ అక్షరం
భారత రక్షణ శాఖకు చెందిన వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. కాసేపటి క్రితం వెబ్ సైట్ డౌన్ అయింది. వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే ' error' అనే మెసేజ్ వస్తోంది. 'మళ్లీ ట్రై చేయండి' అనే వాక్యం కనపడుతోంది. మరో వైపు సైట్ పైభాగంలో ఒక చైనీస్ అక్షరం సైట్లో కనపడుతోంది. దాని అర్థం 'హోం' అని చెబుతున్నారు. దీనిపై ఏఎన్ఐ స్పందిస్తూ, ఇది కచ్చితంగా హ్యాంకింగేనని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
ministry of defence
website
hack
china

More Telugu News