సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష... జైలుకు తరలింపు!
- తుది తీర్పు వెలువరించిన జోధ్ పూర్ కోర్టు
- కోర్టు ముందు భారీ బందోబస్తు
- మరికాసేపట్లో జైలుకు కండల వీరుడు
1998 అక్టోబర్ లో కంకణి దగ్గర కృష్ణ జింకలను వేటాడినట్టు సల్మాన్ తదితరులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సల్మాన్ పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద, మిగతావారిపై సెక్షన్ 149 కింద కేసు అభియోగాలు నమోదు కాగా, మార్చి 28న కేసు విచారణ ముగిసింది. సల్మాన్ కు శిక్ష ఖరారు కాగానే, ఆయన్ను జోధ్ పూర్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు, కోర్టు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఆయన్ను జైలుకు తరలించనున్నారు. ఇక ఈ కేసులో మిగతా నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై బిష్ణోయి సభ హైకోర్టులో అపీలు చేయాలని నిర్ణయించింది.