టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన ఆండర్సన్
- క్రైస్ట్ చర్చ్ టెస్టుతో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పిన జేమ్స్ ఆండర్సన్
- టెస్టుల్లో ప్రపంచంలోనే అత్యధిక బంతులు విసిరిన తొలి పేసర్ గా ఆవిర్భావం
- కోర్ట్నీ వాల్ష్ రికార్డును అధిగమించిన వైనం
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు విసిరిన బౌలర్ల జాబితాలో శ్రీలంక ఆఫ్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్టుల్లో 44,039 బంతులు) అగ్ర స్థానంలో ఉండగా, భారత్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (132 టెస్టుల్లో 40,850 బంతులు) రెండో స్థానంలో ఉన్నాడు, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ (145టెస్టుల్లో 40,705 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో ఆండర్సన్ నిలిచాడు.