మెగాహీరో రొమాంటిక్ లవ్ స్టోరీకి అందమైన టైటిల్?
- తేజుతో కరుణాకరన్ మూవీ
- ప్రేమకథాంశమే నేపథ్యం
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
కరుణాకరన్ కి ప్రేమకథల స్పెషలిస్ట్ అనే పేరుంది. ఈసారి కూడా ఆయన తనదైన స్టైల్లో రొమాంటిక్ లవ్ స్టోరీని మలుస్తున్నాడని తెలుస్తోంది. మాస్ హీరోగా మార్కులు కొట్టేసిన తేజును ఆయన ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.