చేతిలో 500 రూపాయలతో ముంబై వచ్చాను.. సినిమా ఆపర్లు వచ్చేవరకు ఉద్యోగం చేశాను: దిశా పటానీ

  • చాలా ఆడిషన్స్ కు వెళ్లేదానిని
  • నా స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు
  • ఉద్యోగం చేస్తూ, ఆడిషన్స్ కి వెళ్లేదానిని
కేవలం 500 రూపాయలతో ముంబైలో అడుగుపెట్టానని సినీ నటి దిశాపటానీ తెలిపింది. ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా ‘ఎం.ఎస్‌ ధోనీ: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ’తో బాలీవుడ్‌ ని, ‘కుంగ్‌ ఫూ యోగా’తో చైనా చిత్రపరిశ్రమను ఆకట్టుకుంది. తాజాగా ‘బాఘీ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా పటానీ సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులను వెల్లడించింది.

ఒక సినిమా ఆడిషన్ లో తనను హీరోయిన్ గా ఎంపిక చేసి, ఆ తరువాత తన స్థానంలో వేరొక హీరోయిన్ కు అవకాశం ఇచ్చారని చెప్పింది. ముంబై వచ్చిన తొలినాళ్లలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉండేదానినని తెలిపింది. ఇంట్లో వారిని డబ్బులడగడం ఇష్టం లేక, ఉద్యోగం చేసేదానినని చెప్పింది. ఖాళీ సమయాల్లో చాలా ఆడిషన్స్ కు వెళ్లేదానినని, చాలా మటుకు టీవీ సీరియల్స్ ఆడిషన్స్ కు వెళ్లేదానినని తెలిపింది. సినిమాల్లో అవకాశం వచ్చే వరకు ఉద్యోగం చేశానని దిశా చెప్పింది.

baaghi 2
disha patani
Bollywood

More Telugu News