ప్రేమించుకున్నట్టు ఆధారాలుంటే అది రేప్ కిందికు రాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమించుకున్నట్టు ఆధారాలుంటే అది రేప్ కిందికు రాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

  • బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ కీలక తీర్పు
  • రేప్ కేసులో యువకుడిని దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పిన ట్రయల్ కోర్టు
  • తప్పు బట్టిన హైకోర్టు ధర్మాసనం
బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ప్రేమించుకుని పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న తర్వాత రేప్ కేసు పెడితే నిందితుడిని దోషిగా పరిగణించవద్దని పేర్కొంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నట్టు ఆధారాలు ఉంటే ఆ సంబంధాన్ని అత్యాచారంగా పేర్కొనరాదని తేల్చి చెప్పింది.

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడి కేసును విచారించిన ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చుతూ ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును హైకోర్టు పక్కనపెట్టింది. 2013లో చెఫ్ యోగేష్ పాలేకర్ తనతోపాటు క్యాసినోలో పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులకు పరిచయం చేసేందుకు ఆమెను ఓ రోజు ఇంటికి తీసుకెళ్లాడు.

అయితే వారు ఇంటిలో లేకపోవడంతో ఆ రాత్రి ఆమె అక్కడే ఉండిపోయింది. అదే రోజు రాత్రి ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా పలుమార్లు వారు ఈ సంబంధాన్ని కొనసాగించారు. అయితే తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెను పెళ్లాడేందుకు యోగేష్ నిరాకరించాడు. దీంతో ఆమె యోగేష్‌పై రేప్ కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు యోగేష్‌ను దోషిగా తేల్చి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు.

కేసును విచారించిన బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టింది. వారిద్దరూ ప్రేమించుకున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నప్పుడు అతడిని దోషిగా పేర్కొనడం సరికాదని పేర్కొంటూ తీర్పును పక్కనపెట్టింది.
Sexual relation
love
rape
Bombay HIgh court

More Telugu News