రాజమౌళి సినిమాలో రష్మిక మందన?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి సినిమాలో రష్మిక మందన?

  • మల్టీ స్టారర్ కి రాజమౌళి సన్నాహాలు 
  • ఎన్టీఆర్ .. చరణ్ ల కసరత్తు
  • పరిశీలనలో రకుల్ .. రాశి ఖన్నా పేర్లు     
రాజమౌళి తరువాత సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. తాను చేయాలనుకున్న మల్టీ స్టారర్ కోసం ఇప్పటికే చాలా సమయం తీసుకున్న రాజమౌళి, అక్టోబర్లో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకోసం ఒక వైపున ఎన్టీఆర్ .. మరో వైపున చరణ్ రెడీ అవుతున్నారు.

 ఈ ఇద్దరి సరసన కథానాయికలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. రకుల్ .. రాశి ఖన్నా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజాగా రష్మిక మందన పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికలు మాత్రమే అవసరం. మరి రకుల్ .. రాశి ఖన్నా బరిలో ఉండగా రష్మికకి ఛాన్స్ దొరుకుతుందా అనేదే సందేహం. అయితే కన్నడలోను .. ఇటీవల తెలుగులో 'ఛలో' సినిమాతో అమ్మడికి వచ్చిన క్రేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఉండలేం.  
rashmika
rajamouli

More Telugu News