విజయసాయిరెడ్డి చాలా తప్పుడు భాష వాడారు : సుజనా చౌదరి

27-03-2018 Tue 18:33 | National
  • చంద్రబాబునాయుడుపై మాట్లాడిన తీరు చాలా బాధాకరం
  • సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడారు
  • మీడియా ద్వారా విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి 
  • ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సుజనా చౌదరి
తమ నాయకుడు చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయోగించిన పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా మాట్లాడారు. విజయసాయిరెడ్డి కూడా చదువుకున్నాయన.. చార్టెడ్ అకౌంటెంట్. రాజకీయంగా విభేదాలుండొచ్చు కానీ, చంద్రబాబునాయుడు గురించి ఆయన మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉంది. యావత్తు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రజలు తలదించుకునేలా ఉంది.

అసలు, భావి తరాలకు అసలు ఏం తెలియపరుస్తున్నారు? ఆయనకీ భార్యాపిల్లలు ఉన్నారు కదా, వాళ్లు వినే విధంగానే ఆయన మాట్లాడారా? ఈ విధంగా ఉంటే రాజకీయాలకు ఎక్కడికెళుతున్నాయనే విషయాన్ని మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.  భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, పార్లమెంట్ లోకి ఎవరైనా అడుగుపెట్టొచ్చు కానీ, పార్లమెంట్ పరువు తీసేలా వ్యవహరించకూడదు. విజయసాయిరెడ్డి చాలా తప్పుడు భాష వాడారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని, మీడియా ద్వారా విజయసాయిరెడ్డి క్షమాపణ చెబితే మంచిది’ అని సుజనా చౌదరి హితవు పలికారు.
Vijay Sai ReddySujana Chowdary

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more