కేంద్రంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని టీఆర్ఎస్ అడ్డుకోవడం లేదు : టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

  • బీజేపీని కాపాడాల్సిన అవసరం మాకు లేదు
  • మా డిమాండ్లను కేంద్రం పట్టించుకోవట్లేదు
  • రిజర్వేషన్లపై ఆందోళనలు కొనసాగిస్తాం..వెల్ లోకి వెళ్లబోం : కేకే
కేంద్రంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని టీఆర్ఎస్ అడ్డుకోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు (కేకే) అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం నిమిత్తం తమ పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు జితేందర్ రెడ్డి, కె. కేశవరావు, కవిత, వినోద్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశవరావు మాట్లాడుతూ, బీజేపీని కాపాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తమ డిమాండ్లు సాధించడం కోసం పార్లమెంటు లోపల, వెలుపల తాము నిరసనలు తెలుపుతున్నామని అన్నారు. తాము చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవడం లేదని, లోక్ సభ వాయిదాకు టీఆర్ఎస్సే కారణమనడం సబబు కాదని అన్నారు. రిజర్వేషన్లపై ఆందోళనలు కొనసాగిస్తామని, వెల్ లోకి వెళ్లబోమని, తమ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తమకు తెలుసని అన్నారు.
Go Back to Shorts
TRS
kesava rao

More Telugu News