driver saves lives: మండిపోతున్న పెట్రోల్ ట్యాంకర్ ను ధైర్యంగా నడుపుకుంటూ తీసుకెళ్లిన డ్రైవర్

మధ్యప్రదేశ్ లో ఓ ట్రక్ డ్రైవర్ చేసిన సాహసంతో ఎంతో మంది ప్రాణాలకు ప్రమాదం తప్పింది. నర్సింగాపూర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఓ పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉంచిన ఖాళీ ట్యాంకర్ లో మంటలు మొదలయ్యాయి. దీంతో అందరూ పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడే ఉన్న ట్రక్ డ్రైవర్ సాజిద్ మాత్రం దాన్ని అలాగే వదిలేస్తే పెట్రోల్ బంక్ మొత్తం మంటల్లో చిక్కుకుపోయి ఎంతో మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని అనుకున్నాడు. వెంటనే మండిపోతున్న ట్యాంకర్ లోకి ప్రవేశించి దాన్ని స్టార్ట్ చేసి దూరంగా తీసుకెళ్లి వదిలేశాడు. ఈ ప్రమాదంలో అతడికి కాలిన గాయాలవడంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి సాహసాన్ని అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. 

driver saves lives

More Telugu News