పరీక్ష హాలుకి చంటిబిడ్డతో వచ్చి.. పాలిస్తూ పరీక్ష రాసిన మహిళ.. ఫొటో వైరల్
- అఫ్గనిస్థాన్కు చెందిన 25 ఏళ్ల జహాన్
- రెండు నెలల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన జహాన్
- ఉన్నత చదువుల కోసం తాజాగా ఎంట్రెన్స్ పరీక్ష రాసిన మహిళ
- పరీక్ష రాస్తుండగా పాలకోసం ఏడ్చిన బిడ్డ
దీంతో ఆమె తన బిడ్డను తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చింది. పరీక్ష రాస్తుండగా ఆమె బిడ్డ పాల కోసం ఏడవడంతో కుర్చీలోంచి లేచి బిడ్డను తీసుకుని వచ్చి కింద కూర్చొని పాలిస్తూ పరీక్ష రాసింది. ఓ లెక్చరర్ ఆ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఆ లెక్చరర్ కొన్ని కారణాలతో తన పోస్ట్ ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఈ ఫొటోను చాలా మంది షేర్ చేశారు.