చైనా మార్కెట్‌లోనూ 'బాహుబలి-2' రికార్డులు సృష్టించనుందా?

  • చైనాలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న బాహుబలి-2
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
  • బాహుబలి-1 కలెక్షన్ల రికార్డును ఇది బద్దలు కొడుతుందని సినీ విశ్లేషకుల అంచనా
బాలీవుడ్ సినిమాలు ఇటీవలి కాలంలో చైనాలో విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. అమీర్ ఖాన్ నటించిన దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాలతో పాటు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చైనా భాషలో విడుదల చేసిన మన అసలు సిసలు తెలుగు చిత్రం 'బాహుబలి...ది బిగినింగ్'కి కూడా చెప్పుకోదగ్గ ఆదరణే లభించింది.

ఇప్పుడు 'బాహుబలి 2 : ది కన్‌క్లూజన్' వంతొచ్చింది. ఈ భాగం కూడా అక్కడ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మనదేశంలో బాహుబలి డబ్బింగ్ వెర్షన్‌కు కూడా విపరీతమైన ఆదరణ లభించింది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిపెట్టిన తొలి డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు చైనాలోనూ బాహుబలి-1 నెలకొల్పిన రికార్డును బాహుబలి-2 బద్దలు కొడుతుందని సినీ వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Prabhas
Baahubali 2: The Conclusion
China
Dangal

More Telugu News