చిరంజీవిది పోస్ట్ పెయిడ్.. పవన్ ది ప్రీ పెయిడ్: కేశినేని నాని
- ప్రత్యేక హోదాపై చిరంజీవి స్పందించడం లేదు
- దీనిపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?
- బీజేపీకి జనాలు బుద్ధి చెబుతారు
చిరంజీవి ప్రజారాజ్యం పోస్ట్ పెయిడ్ పార్టీ అయితే... పవన్ జనసేన ప్రీ పెయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. బీజేపీకి పోయేకాలం దాపురించిందని అన్నారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని... కానీ ఆ పార్టీకి జనాలు బుద్ధి చెబుతారని తెలిపారు. అవిశ్వాసంపై చర్చకు అనుమతించే ఆలోచన కేంద్రానికి లేదని... సభను ఆర్డర్ లో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్ దేనని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.