లెనోవో నుంచి ఫుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లు... ప్రస్తుతానికి చైనాలో ఆవిష్కరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లెనోవో నుంచి ఫుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లు... ప్రస్తుతానికి చైనాలో ఆవిష్కరణ

  • 5.7 అంగుళాల బెజెల్ లెస్ డిస్ ప్లే
  • వెనుక భాగంలో 13+5 మెగా పిక్సల్స్ కెమెరాలు
  • ముందు భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా
లెనోవో ఫుల్ స్క్రీన్ తో కూడిన కె5, కె5 ప్లే పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను చైనాలో ఆవిష్కరించింది. ఈ రెండూ బడ్జెట్ ఫోన్లే. లెనోవో కె5 ధర మన కరెన్సీలో సుమారు రూ.9,000, కె5 ప్లే ధర సుమారు రూ.7,000. ఈ రెండు ఫోన్లలోనూ 5.7 అంగుళాల హెచ్ డీ+ బెజెల్ లెస్ డిస్ ప్లే ఉండడం ఆకర్షణీయం.

స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 18:9. ఆండ్రాయిడ్ 7.1నౌగత్ వెర్షన్ పై పనిచేస్తాయి. 13మెగాపిక్సల్స్+5మెగాపిక్సల్స్ కాంబినేషన్ కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి. ప్రైమరీ కెమెరా మాత్రం 13 మెగా పిక్సల్స్ తో ఉంటుంది. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. బ్లాక్, గ్రే, బ్లూ రంగుల్లో లభ్యమవుతాయి. 1.5 గిగాహెర్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీతో కె5 ఉంటుంది. కె5ప్లే ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు స్టోరేజీ పెంచుకునే ఆప్షన్ ఉంది.
lenovo k5
lenovo k5 play

More Telugu News