కాలేజీ హాస్టల్ లో గదికి ఇద్దరే... 10 తరువాత పడుకోవాల్సిందే: విద్యార్థుల మేలు కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు ఆదేశాలు
- అరకొర వసతులతో హాస్టళ్లు
- ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు
- ఇంటర్ కాలేజీలకు కొత్త మార్గదర్శకాలు
- మీరితే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు
ఇక ప్రధాన నిబంధనలను పరిశీలిస్తే, హాస్టల్ గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలి. 8 మంది బాలురకు ఒకటి, ఆరుగురు బాలికలకు ఒకటి బాత్ రూము తప్పనిసరి. ఒక్కో విద్యార్థికి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఉదయం 6 గంటలలోపు నిద్రలేపకూడదు. రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్ ఉండరాదు. 360 మంది విద్యార్థులు ఓ యూనిట్ గా ఉండాలి. యూనిట్ లో ఆరుగురు వంట సిబ్బంది తప్పనిసరి. భోజనం నాణ్యంగా ఉండాలి. ఫుడ్ ఇనస్పెక్టర్ నేతృత్వంలో నిరంతరం పర్యవేక్షించాలి. నెలకోసారి పేరెంట్, టీచర్ సమావేశం తప్పనిసరి. సెలవులు ఇస్తే విద్యార్థులను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలి. ఈ నిబంధనలు ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలలతో పాటు ప్రభుత్వ కాలేజీలకూ వర్తిస్తాయి.