'ఎమ్మెల్యే' ట్రైలర్‌: 'నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టలేదు' అంటోన్న కల్యాణ్ రామ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎమ్మెల్యే' ట్రైలర్‌: 'నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టలేదు' అంటోన్న కల్యాణ్ రామ్‌

  • అలరిస్తోన్న డైలాగులు
  • పిల్లలకు చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు అనే కాన్సెప్ట్‌తో సినిమా
  • ఈ నెల 23న 'ఎమ్మెల్యే' విడుదల
నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తీస్తోన్న ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.

'మా ఊరిలో నన్ను అందరూ మంచి లక్షణాలున్న అబ్బాయి అని పిలుస్తారు.. దాన్నే షార్ట్ ఫామ్‌లో ఎమ్మెల్యే' అంటారు అని కల్యాణ్ రామ్ చెబుతోన్న డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి. 'పిల్లలకు ఆస్తులిస్తే అవి ఉంటేనే బతుకుతారు.. అదే చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు' అంటూ కాజల్ ఓ డైలాగ్ కొట్టింది. ఈ సినిమా కథ కాజల్ వదిలిన ఈ డైలాగ్‌ను బట్టి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 'నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టేలేదు.. మొదలు పెడితే మీరు చేయడానికి ఏమీ ఉండద'ని కల్యాణ్ రామ్ మరో డైలాగు చెప్పాడు. మీరూ చూడండి..  
Kajal Agarwal
kalyan ram
mla

More Telugu News