పాలమూరులో విషాదం.. ఇంట్లోంచి పరుగెడుతూ వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక
- ఇంట్లో చేసుకునే పని విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ
- తీవ్ర మనస్తాపానికి గురైన మానస (15)
- మృతదేహాన్ని 2 గంటలపాటు శ్రమించి బయటకు తీసిన సిబ్బంది
ఆ బావి లోతు 65 అడుగులు ఉంటుందని అధికారులు చెప్పారు. ఆ బాలిక జగ్జీవన్‌రాం కాలనీకి చెందిన రాములు, వెంకటమ్మల నాలుగో కూతురు మానస (15) అని పోలీసులు చెప్పారు. ఇంట్లో చేసుకునే పని విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగిందని, ఈ కారణంగానే మనస్తాపానికి గురైన మానస ఈ ఘటనకు పాల్పడిందని తేల్చారు. కాగా, ఆ బావి బస్టాండ్‌కు సమీపంలోనే ఉంటుందని, దానికి ఇనుప కంచె ఏర్పాటు చేయాలని తాము చాలా సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు.