కృష్ణ బిలాలపై అపార పరిశోధన... చక్రాల కుర్చీకే పరిమితమైన మహాజ్ఞాని... స్టీఫెన్ హాకింగ్ గురించిన ఆసక్తికర వివరాలు!
- బ్లాక్ హోల్స్ పై అపార పరిశోధనలు
- మృత్తువు అంచులకు చేరిన వేళ కూడా ప్రసంగాలు
- సహకరించని విధిని అనుకూలంగా మార్చుకున్న జ్ఞాని
స్టీఫెన్ హాకింగ్ జీవితంలో ముఖ్య ఘట్టాలు...
* జనవరి 8, 1942న ఆక్స్ ఫర్డ్ లో జననం
* రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండటంతో సురక్షిత ప్రాంతానికి తరలిన కుటుంబం
* ఆపై హైగేట్స్ ప్రాంతానికి వచ్చి విద్యాభ్యాసం
* గణిత శాస్త్ర విద్యపై స్టీఫెన్ ఆసక్తి... రసాయన శాస్త్రంలో చేర్పించిన తండ్రి
* 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్
* 1962లో తొలిసారిగా బయటపడిన అనారోగ్యం
* యూనివర్శిటీలో పరిచయమైన మహిళతో వివాహం
* ఇద్దరు మగపిల్లలు, ఓ ఆడపిల్ల జననం
* స్టీఫెన్ కు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకినట్టు తేల్చిన వైద్యులు
* కనీసం బూట్ల లేస్ కూడా కట్టుకోలేని స్థితికి చేరిన స్టీఫెన్
* డాక్టరేట్ రాకుండానే మరణిస్తాడని తేల్చిన వైద్యులు... స్టీఫెన్ ఆత్మస్థైర్యం ముందు ఓడిన మృత్యువు
* తిరిగి వర్శిటీకి వచ్చి పరిశోధనలు మొదలు
* మొదటి భార్యతో విడాకుల తరువాత తనకు సేవలందిస్తున్న నర్సుతో వివాహం
* తన రోగాన్ని మరచిపోయి క్వాంటమ్ థియరీ సాయంతో బ్లాక్ హోల్స్ పై విస్తృత పరిశోధన
* 1984లో 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' పుస్తకంతో రచనలు మొదలు
* తొలి పుస్తకంతోనే ఎనలేని ఖ్యాతి... తెలుగులో 'కాలం కథ' పేరుతో విడుదల
* 1985 మరింత విస్తరించిన వ్యాధి, పూర్తిగా ఆసుపత్రికే పరిమితం
* మాట్లాడే కంప్యూటర్ ను ఒంటికి అమర్చుకున్న స్టీఫెన్
* అప్పటి నుంచి వర్శిటీలో ప్రొఫెసర్ గా, వ్యాసకర్తగా, ప్రసంగీకుడిగా లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన స్టీఫెన్ హాకింగ్
* ఆరోగ్యం పూర్తిగా విషమించి మార్చి 14, 2018... బుధవారం కన్నుమూత