దేవుడి శిక్ష... చేతులు కాళ్లుగా, కాళ్లు చేతులుగా మారిపోయాయి... నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఫోటో... అసలు నిజమిది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేవుడి శిక్ష... చేతులు కాళ్లుగా, కాళ్లు చేతులుగా మారిపోయాయి... నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఫోటో... అసలు నిజమిది!

  • మరొకరి భార్యతో అక్రమ సంబంధం
  • దాని ఫలితమే ఇలా మారిపోయాడట
  • అసలు నిజం వేరే... నైజీరియా నటుడితను
  • ప్రత్యేక మేకప్ తో ఇలా మారిపోయాడు
నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఫోటో ఇది. ఇందులోని వ్యక్తికి కాళ్లు ఉండాల్సిన చోట చేతులు, చేతులు ఉండాల్సిన చోట కాళ్లు ఉండటమే ఈ ఫోటోను ప్రతి ఒక్కరూ షేర్ చేసుకునేలా చేస్తోంది. అబ్దుల్లా అనే వ్యక్తి ఈ ఫోటోను తొలిసారిగా పోస్టు చేశాడు. మరొకరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు దేవుడు అతనికి శిక్ష వేశాడని, దాని ఫలితమే ఇలా జరిగిందని ఓ కామెంట్ ను కూడా రాశాడు. ఇక ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి? ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారా? వంటి విషయాలను పట్టించుకోకుండా షేర్ చేస్తున్నారు. ఇంతకీ నిజం ఏమిటంటారా? ఈ చిత్రంలో ఉన్నది నైజీరియా నటుడు ముకాయిలా. ఓ సినిమా కోసం అతనిలా మేకప్ చేసుకున్నాడట. ప్రత్యేక మేకప్ సహాయంతో మేకప్ ఆర్టిస్ట్ హమీమ్ ఇటువంటి లుక్ ను తెచ్చాడు. ఇక వినూత్నంగా కనిపిస్తే, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని ఎవరూ చేయరని మరోసారి రుజువైంది.
Makeup
God
Nigiria
Social Media
Viral

More Telugu News