Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు అరెస్ట్!

  • అంధేరీలో కారుతో రిక్షాను ఢీకొట్టిన ఆదిత్య నారాయణ్
  • అరెస్ట్ చేసిన పోలీసులు 
  • బెయిలుపై విడుదల
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఆయన తన కారులో ప్రయాణిస్తూ అంధేరీ ప్రాంతంలోని లోఖండ్‌వాలా సర్కిల్ వద్ద ఓ రిక్షాను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రిక్షా కార్మికుడు, ఓ ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిత్యపై సెక్షన్ 338, 279 కింద కేసులు నమోదు చేసిన వెర్సోవా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం రూ.10వేల పూచీకత్తుతో బెయిలుపై విడుదల చేశారు. కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, ప్రమాదంలో గాయపడిన రిక్షా కార్మికుడు, ప్రయాణికురాలిని ఆదిత్య వెంటనే కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఆదిత్య నారాయణ్ పలు సినిమాల్లో పాటలు పాడాడు. 
Bollywood
Aditya Narayan
Arrest
Udit Narayan

More Telugu News