ట్యాంక్ బండ్‌తో పాటు ప్రొ.కోదండరామ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు
Add ap7am to your home Screen

ట్యాంక్ బండ్‌తో పాటు ప్రొ.కోదండరామ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు

  • అనుమతి లేకపోయినా రేపు ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌
  • అప్రమత్తమైన పోలీసులు
  • ఈ రోజు అర్ధరాత్రి టీజేఏసీ ప్రముఖులను అరెస్టు చేసే అవకాశం
తెలంగాణ వచ్చి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్.. రేపు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ రేపు ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయం తీసుకుంది.

దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు అర్ధరాత్రి టీజేఏసీ ప్రముఖులను అరెస్టు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ప్రొ.కోదండరామ్ ఇంటి వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 
Kodandaram
Telangana
jac
Police
Hyderabad

More Telugu News