పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లను కలిసిన రాజమౌళి

  • ఇంగ్లాండ్‌ ఓపెన్‌ కోసం వెళుతోన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు
  • వారితో ఫొటో దిగిన రాజమౌళి
  • ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన దర్శక ధీరుడు
ఇంగ్లాండ్‌ ఓపెన్‌ కోసం వెళుతోన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లను తాను కలిసినట్లు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి చెప్పారు. ఈ రోజు రాజమౌళి ఓ ట్వీట్ చేస్తూ సదరు క్రీడాకారులతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. వారిద్దరి మధ్య నిలబడ్డ రాజమౌళి చిరునవ్వు చిందిస్తూ ఫొటో దిగారు. బ్యాడ్మింటన్‌లో వారు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్లో ఉన్నారు. ఆయన యువ హీరోలు రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ల కాంబినేషన్‌లో ఓ సినిమా తీయాలనుకుంటున్నారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Rajamouli
PV Sindhu
srikanth kidambi

More Telugu News