చైనాలోను 'సైరా' షూటింగ్ .. కారణం అదే!

  • రెండవ షెడ్యూ ల్ దిశగా 'సైరా'
  • చైనాలోను రిలీజ్ చేసే ఆలోచన
  • కీలకమైన పాత్రలో అమితాబ్  
చరణ్ నిర్మాతగా రూపొందుతోన్న 'సైరా' చిత్రం .. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను చైనాలోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అందువలన అక్కడ కూడా కొంత భాగాన్ని షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు.

 చైనాలో విడుదలైన 'సీక్రెట్ సూపర్ స్టార్' .. 'దంగల్' .. 'బజరంగీ భాయీజాన్' చిత్రాలు అనూహ్యమైన విజయాలను అందుకున్నాయి. అంతేకాకుండా చైనాలో చిత్రీకరణ జరుపుకునే చిత్రాలకు అక్కడి ప్రభుత్వం మంచి రాయితీలను కూడా అందిస్తోందట. అందువలన ఈ సినిమాను అక్కడ కూడా చిత్రీకరించాలనీ .. అక్కడ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తుండగా, అమితాబ్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.  
Go Back to Shorts
chiranjeevi
nayanathara

More Telugu News