Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెండితెరపై శృంగార తార షకీలా జీవితం

  • సినిమాగా తెరకెక్కనున్న శృంగార తార జీవితం
  • 1990ల్లో ఓ వర్గం ప్రేక్షకుల్లో విశేష ఆదరణ
  • ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలు...వచ్చే ఏడాది రిలీజ్..!
1990ల్లో మలయాళ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన శృంగార తార షకీలా జీవితం త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కానుంది. మనదేశంలోనే కాక చైనా, నేపాల్ దేశాల్లోనూ ఆమెకు అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. దక్షిణాదిన మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాల్లోనూ ఆమె నటించింది. అంతేకాక ఆమె సినిమాలను దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించడమే కాక చైనీస్, నేపాలీస్ లాంటి ఇతర విదేశీ భాషల్లోకి కూడా డబ్బింగ్ చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ ఏ పాటితో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు!. బాలీవుడ్ నటి రిచా చద్దాతో తీస్తున్న ఈ సినిమాకు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించనున్నారు.

ఇందులో షకీలా 16 ఏళ్ల ప్రాయంలో సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత ఈ రంగుల ప్రపంచంలో ఆమె సాగించిన సుదీర్ఘ ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాలను సెల్యూలాయిడ్‌పై కళ్లకుకట్టినట్టుగా ఆవిష్కరించనున్నారని సమాచారం. ఈ ఏప్రిల్‌‍లో సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో మరో శృంగార తార సిల్క్ స్మిత జీవితచరిత్రను బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో 'డర్టీ పిక్చర్' పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. మరి ఇపుడు షకీలా సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి...
Indrajit Lankesh
Shakeela
Richa Chadha

More Telugu News