బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి!
- తమిళనాడులో పెరియార్ విగ్రహం ధ్వంసం
- తీవ్ర ఆగ్రహానికి గురైన పెరియార్ మద్దతుదారుల
- కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై దాడి
విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న కార్యక్రమం కొనసాగుతుండగానే... స్థానికులు వారిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు బీజేపీ నేతగా గుర్తించారు. దీంతో, బీజేపీపై పెరియార్ మద్దతుదారుటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.