30 సెకన్లలో లోక్ సభ, 3 నిమిషాల్లో రాజ్యసభ వాయిదా.. హోరెత్తుతున్న పార్లమెంట్!
- ఆందోళనలతో వేడెక్కిన పార్లమెంట్
- నినాదాలతో సభను అడ్డుకుంటున్న ఎంపీలు
- ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డ ఉభయసభలు
సభలను ఆర్డర్ లో పెట్టేందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ముఖ్యమైన విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంది... సభలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలంటూ పలుమార్లు కోరినా సభ్యులు శాంతించలేదు. దీంతో, ప్రారంభమైన నిమిషం లోపే లోక్ సభ, మూడు నిమిషాల్లో రాజ్యసభ వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.