ఏపీ అసెంబ్లీ ముందు మోదీ వ్యతిరేక హోర్డింగులు... కలకలం!
- 'మోదీజీ ఏమిటీ వివక్ష?' అంటూ ప్లెక్సీ
- కాట్రగడ్డ బాబు పేరిట హోర్డింగ్
- ఎలా అనుమతించారని ప్రశ్నించిన బీజేపీ
- ప్రభుత్వ ఉద్దేశం ఇదేనా అని నేతల విమర్శ
ఈ హోర్డింగులను పెట్టేందుకు ప్రభుత్వం ఎలా అనుమతించిందని వారు ప్రశ్నించారు. ఇది టీడీపీ ఉద్దేశమా? లేక వ్యక్తిగతమా? అన్నది తేల్చి చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు. తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ, టీడీపీ ఏ మాత్రమూ తమను ఖాతరు చేయడం లేదని ప్రధానినే అవమానిస్తున్నారని మాధవ్ ఆరోపించారు.