ఫైనల్ పాకిస్థాన్ లో అయితే నేను ఆడను: కలకలం రేపుతున్న కెవిన్ పీటర్సన్ ప్రకటన
- వీక్షకులు లేక వెలవెలబోతున్న పీఎస్ఎల్
- సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లు పాక్ లో నిర్వహించాలని పీసీబీ నిర్ణయం
- పాక్ లో అయితే రానని తెగేసి చెప్పిన కెవిన్ పీటర్సన్
అయితే, పాక్ లో మ్యాచ్ లు నిర్వహిస్తే తాను రానని క్వెట్టా గ్లాడియేటర్స్ తరుఫున ఆడుతున్న కెవిన్ పీటర్సన్ యాజమాన్యానికి తెలిపాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్ కు చేరినా తాను పాక్ లో ఆడనని తెగేసి చెప్పాడు. దీంతో పాక్ బోర్డు అవాక్కైంది. తరువాతి సీజన్ ను పాక్ లోనే నిర్వహించనున్నామని పీసీబీ ఛైర్మన్ నజీమ్ సేథీ తెలిపారు. రెండేళ్లలోనే పీఎస్ఎల్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినందుకు సంతృప్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. పీటర్సన్ నిర్ణయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.