రేపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
- విభజన హామీల సాధనకై ఎంపీలకు దిశానిర్దేశం..!
- కేంద్రంపై జగన్ అవిశ్వాస ప్రకటనపైనా చర్చించే అవకాశం
- ఈ నెల 5 నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మరోవైపు ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమని వైకాపా ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ఫిబ్రవరిలో మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తిరిగి ప్రారంభమవుతున్న ఈ సమావేశాల్లో ఎలా తమ హక్కులను సాధించుకోవాలనే అంశంపై ఎంపీలకు బాబు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.