ఇండియన్ మార్కెట్లో ఎదురులేని 'లెనెవో'.. శాంసంగ్, ఐబాల్ కు అందనంత ఎత్తులో!

  • యాండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ అమ్మకాల్లో అగ్రస్థానం
  • వరుసగా మూడో ఏడాది టాప్ ప్లేస్
  • 30.8 శాతం మార్కెట్ షేర్ కైవసం  
యాండ్రాయిడ్ ట్యాబ్లెట్ బిజినెస్ లో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనెవో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. భారత్ లో అత్యధిక అమ్మకాలు జరిపిన సంస్థగా వరుసగా మూడో ఏడాది కూడా నిలిచింది. 2017 ఏడాది చివరి నాటికి ఇండియాలో 30.8 శాతం మార్కెట్ షేర్ ను కలిగిన సంస్థగా రికార్డులకెక్కింది.

ఈ సందర్భంగా లెనెవో ఇండియా ఎండీ, సీఈవో రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ అమ్మకాల్లో శాంసంగ్ (మార్కెట్ షేర్ 19.9 శాతం), ఐబాల్ (17.7 శాతం) తదితర సంస్థలకు అందనంత ఎత్తులో ఉన్నామని తెలిపారు. భారత్ లో పెరుగుతున్న మార్కెట్ తో పాటు, కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకోగలగడమే తమ విజయానికి కారణమని చెప్పారు. తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడం, అగ్రస్థానాన్ని ఇలాగే కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు.
Go Back to Shorts
lenevo'
tablets
samsung
iball

More Telugu News