బ్యాంకు మోసగాడు నీరవ్ మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి ఏర్పాట్లు
- ముంబైలోని వర్లీలో 58 అడుగుల నీరవ్ దిష్టిబొమ్మ
- ఆయన్ని తలపించేలా బొమ్మకు అలంకరణ
- హోలిక దహన్ ఉత్సవంలో భాగంగా దహనం
నీరవ్ మోదీ దిష్టిబొమ్మను ఓ పొడవాటి వజ్రంపై కూర్చోబెట్టారు. బొమ్మకు బ్రౌన్ కలర్ కోటు వేశారు. బొమ్మ కింద ఉండే బోర్డుపై 'పీఎన్బీ స్కాం..డైమండ్ కింగ్' అని రాసుంది. కాగా, నీరవ్తో పాటు ఈ కుంభకోణంలో మరో నిందితుడయిన ఆయన మామ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మేహుల్ చోక్సీలను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ, ఈడీ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించాయి.