ఫ్లాష్ బ్యాక్: యవ్వనం కోసం ఇంజెక్షన్లు, ప్రేమ వివాహంపై ప్రశ్నలకు శ్రీదేవి స్పందన వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లాష్ బ్యాక్: యవ్వనం కోసం ఇంజెక్షన్లు, ప్రేమ వివాహంపై ప్రశ్నలకు శ్రీదేవి స్పందన వీడియో చూడండి

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నపాత ఇంటర్వ్యూ 
  • పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టమన్న 'శ్రీ' 
  • ఇంకా పలు ఆసక్తికర సమాధానాలు 
కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టి, యావత్ సినీజగత్తును శోకసంద్రంలో ముంచెత్తుతూ ప్రముఖ సినీ నటి శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ‘రూప్ కీ రాణీ..’ సినిమా సమయంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జర్నలిస్టు ‘మీరు నిత్యం యవ్వనంగా ఉండేందుకు ఎటువంటి ఇంజక్షన్లనైనా తీసుకుంటారా? మీ అభిమానులు అలా అనుకుంటున్నారు' అంటూ ప్రశ్నించింది.

దానికి శ్రీదేవి సమాధానమిస్తూ ‘జనమంతా ఎందుకు అలా అనుకుంటారో తెలియదు గానీ, నేనైతే ఎటువంటి ఇంజక్షన్లను తీసుకోను’ అన్నారు. ఇన్నేళ్లు సినీ పరిశ్రమలో విజయవంతంగా ఉండడానికి కారణం అదృష్టమా? అని అడిగితే.. దానికి ‘ఇండస్ట్రీలో విజయవంతం కావడం అనేది లక్ అని నేను అనుకోవడంలేదు. లక్‌ పైన మాత్రమే నమ్మకం పెట్టుకోను. ఒక వ్యక్తిలో అన్ని రకాల క్వాలిటీలూ ఉంటాయి. వీటిలో రైట్ టాలెంట్, బ్యూటీ, డాన్స్ అనేవి గుర్తించి వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి’ అని సమాధానం చెప్పింది. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా? లేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అంటే ఆ విషయాలు తన తల్లి చూసుకుంటారని చెప్పిన శ్రీదేవి, తనకు పెద్దలు కుదిర్చిన వివాహమే ఇష్టమని అప్పట్లో చెప్పారు. 
Sridevi
Social Media
Viral Videos

More Telugu News