పుజారాకు ప్రమోషన్.. తండ్రి అయిన టీమిండియా నయావాల్
- పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పుజారా భార్య పూజ
- ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఆనందం పంచుకున్న క్రికెటర్
- క్రికెటర్లు, నెటిజన్ల శుభాకాంక్షలు
తాను తండ్రిని కాబోతున్నట్టు జనవరి 1నే పుజారా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పుజారా ప్రస్తుతం సౌరాష్ట్ర తరపున విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఐపీఎల్ సమయంలో ఖాళీగా ఉండకుండా యార్క్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. తండ్రి అయిన పుజారాకు క్రికెటర్లు, నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.