హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ బస్టాండ్‌ వద్ద అమ్మాయిని వేధిస్తోన్న పోకిరీ.. అదుపులోకి తీసుకున్న షీ టీమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ బస్టాండ్‌ వద్ద అమ్మాయిని వేధిస్తోన్న పోకిరీ.. అదుపులోకి తీసుకున్న షీ టీమ్

  • సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఓ యువతి
  • వివరాలను షీ టీమ్స్ వాట్సప్‌కు పంపిన అమ్మాయి
  • రోడ్ నంబర్ 12 పింఛను ఆఫీసు వద్ద ఘటన
హైదరాబాద్‌లో ఈవ్ టీజర్ల ఆటలకు షీ టీమ్స్ చెక్ పెడుతోంది. వాట్సప్ ద్వారా సమాచారం అందించినా కూడా వెంటనే వచ్చి పోకిరీల చేతులకు బేడీలు వేస్తోంది. తాజాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 12 పింఛను ఆఫీసు వద్ద ఓ యువతిని యువకుడు వేధించాడు. దీంతో ఆ అమ్మాయి తన సెల్‌ఫోన్‌లో దానిని వీడియో తీసి షీ టీమ్స్ వాట్సప్ నెంబరుకి పంపింది. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న షీ టీమ్స్ పోలీసులు.. ఆ పోకిరీని అదుపులోకి తీసుకున్నారు.                       
she
team
Hyderabad

More Telugu News