కీర్తి సురేశ్ పై కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీర్తి సురేశ్ పై కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్!

  • యూత్ లో కీర్తి సురేశ్ కి ఒక రేంజ్ లో క్రేజ్
  • అగ్రకథానాయకుల సినిమాల్లో వరుస ఛాన్సులు 
  • మేకప్ కారణంగా జరుగుతోన్న ఆలస్యం  
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. బొద్దుగా వుండే ఈ భామకి అవకాశాలు వరుసబెట్టి వస్తున్నాయి. తెలుగులో 'అజ్ఞాతవాసి' సినిమా చేసిన ఈ సుందరి, ప్రస్తుతం 'మహానటి' చేస్తోంది. ఇక తమిళ సినిమాల విషయానికొస్తే, అక్కడి అగ్రకథానాయకులతో వరుస సినిమాలు చేస్తోంది. ఈ కారణంగానే ఆమె ధోరణిలో మార్పు వచ్చేసిందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది.

 షూటింగుకి ఉదయాన్నే వచ్చేస్తుందట .. కానీ కారవాన్ లో నుంచి ఒక పట్టాన బయటకి రాదట. మేకప్ విషయంలో ఆమె తీసుకునే అతి జాగ్రత్తే ఇందుకు కారణమని అంటున్నారు. చిన్న షాట్ కి కూడా హెవీగా మేకప్ చేసుకుని గాని ఆమె కారవ్యాన్ దిగదని చెబుతున్నారు. ఈ కారణంగా సీనియర్ నటీనటులు .. హీరోలు .. యూనిట్ సభ్యులు అంతా కూడా అసహనానికి లోనవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రచారం పట్ల కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.    

keerthi suresh

More Telugu News