కేక్ కట్ చేసి.. 73వ పుట్టిన రోజు జరుపుకున్న విజయనిర్మల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేక్ కట్ చేసి.. 73వ పుట్టిన రోజు జరుపుకున్న విజయనిర్మల!

  • హైద‌రాబాద్‌లోని విజ‌య నిర్మ‌ల స్వ‌గృహంలో వేడుక
  • విజయనిర్మలను కొనియాడిన కృష్ణ
  • మా అభిమానులను మా చుట్టాలుగా భావిస్తుంటాం: విజయనిర్మల
దర్శకురాలు విజయ నిర్మల ఈ రోజు 73వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు. హైద‌రాబాద్‌లోని ఆమె స్వ‌గృహంలో జరిగిన ఈ వేడుకలో భర్త సూపర్ స్టార్ కృష్ణ, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె భర్త, సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ... విజ‌య నిర్మ‌ల దర్శకత్వం వహించిన సినిమాల్లో 50 శాతం సినిమాల్లో తానే న‌టించానని చెప్పారు.

ఎన్నో హిట్ సినిమాలు చేసిన ద‌ర్శ‌కురాలు విజ‌యనిర్మ‌ల అని ఆమెను అభినందించారు. గిన్నిస్ బుక్ లో ఇప్పటికే స్థానం ద‌క్కించుకున్న విజ‌య‌నిర్మ‌ల మ‌రో ఐదారు సినిమాలు చేస్తే యాభై సినిమాలు చేసిన ద‌ర్శ‌కురాల‌వుతారని తెలిపారు. కాగా, తమ అభిమానులను తాము తమ చుట్టాలుగా భావిస్తుంటామని విజయనిర్మల చెప్పారు.      
krishna
vijaya nirmala
birthday

More Telugu News