7 కోట్లు చెల్లించి, నా అనుమతి తీసుకుని ఆ పాటను వాడుకోండి: బాలీవుడ్ నిర్మాతకు హర్యానా సింగర్ నోటీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

7 కోట్లు చెల్లించి, నా అనుమతి తీసుకుని ఆ పాటను వాడుకోండి: బాలీవుడ్ నిర్మాతకు హర్యానా సింగర్ నోటీసులు

  • ‘వీరే ది వెడ్డింగ్‌’ సినిమాలో ‘హట్‌ జా తూ’ పాట
  • ఆ పాట తనది అంటున్న హర్యానా సింగర్ వికాస్ కుమార్
  • కరీనా కపూర్‌, సోనం కపూర్‌, స్వర భాస్కర్‌ ప్రధాన పాత్రల్లో ‘వీరే ది వెడ్డింగ్‌’
మహిళా ప్రాధాన్య చిత్రంగా కరీనా కపూర్‌, సోనం కపూర్‌, స్వర భాస్కర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వీరే ది వెడ్డింగ్‌’ సినిమాలో వినియోగించుకున్న పాట వివాదాస్పదమైంది. శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్వయంగా రచించి పాడిన ‘హట్‌ జా తూ’ పాటను అనుమతి లేకుండా వాడుకున్నారని హర్యానాకు చెందిన సింగర్ వికాస్ కుమార్ ఆరోపించారు.

దీనిపై చిత్రయూనిట్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పాటను వాడుకున్నందుకు క్షమాపణలు చెప్పి, 7 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఆ తరువాత తన అనుమతితో పాటను సినిమాలో వినియోగించుకోవాలని ఆయన నోటీసుల్లో సూచించారు. వికాస్‌ కుమార్‌ డిమాండ్ల మేరకు చిత్రయూనిట్‌ నడుచుకోకుంటే వారిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని, కేంద్ర సెన్సార్‌ బోర్డు చైర్మన్‌ కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన లాయర్‌ తెలిపారు.
Bollywood
veer the wedding
movie
song controversy

More Telugu News