ఆభరణాల షాపునకు వచ్చి దర్జాగా దొంగతనం చేస్తున్న మహిళలు... సీసీ కెమెరా ఫుటేజ్!
- నగలు కొంటామంటూ వచ్చి దోపిడీ
- హైదరాబాద్, బొల్లారంలో ఘటన
- అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ సమయంలో షాపులో యజమానురాలు కూర్చుని ఉంది. ఆమె పట్టీలను తీసి చూపిస్తుంటే, ఓ యువతి ఒక్కొక్కటిగా వెండి పట్టీలను పక్కకు తప్పించింది. మొత్తం కిలో బరువున్న వెండిని దొంగిలించింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. వారు వెళ్లిపోయిన తరువాత వెండి ఆభరణాలు పోయాయని గుర్తించిన ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సీసీ కెమెరాలు పరిశీలించి, వారు ఈ ప్రాంతంవారేనని గుర్తించి అరెస్ట్ చేశారు. వెండిని రికవరీ చేశామని, నిందితులను రిమాండ్ చేశామని వెల్లడించారు.