'అ!' సినిమాతో అభిరుచి కలిగిన నిర్మాతగా నాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అ!' సినిమాతో అభిరుచి కలిగిన నిర్మాతగా నాని!

  • విభిన్నమైన కంటెంట్ 
  • విలక్షణమైన పాత్రలు 
  • ఆసక్తికరమైన మలుపులు
నాని నిర్మాతగా రూపొందించిన 'అ!' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ .. రెజీనా .. నిత్యామీనన్ .. ఈషా రెబ్బా  .. అవసరాల .. మురళీశర్మ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా కంటెంట్ చాలా కొత్తగా ఉందని అంటున్నారు.

 మానసిక క్షోభకి గురయ్యే పాత్రలో కాజల్ .. మానసిక వైద్యురాలి పాత్రలో నిత్యామీనన్ .. బేరర్ పాత్రలో రెజీనా .. మెజీషియన్ పాత్రలో మురళీ శర్మ .. సైంటిస్ట్ పాత్రలో అవసరాల పాత్రలు చాలా విలక్షణంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ పాత్రలను మలిచిన తీరుకు .. నడిపించిన విధానానికి అంతా దర్శకుడిని అభినందిస్తున్నారు. వైవిధ్యభరితమైన ఈ సినిమాను సాహసంతో నిర్మించిన నాని అభిరుచిని మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా వసూళ్లపరంగా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.     
kajal
rejina
nithya menon

More Telugu News