కొండెక్కి కూర్చున్న 'ఒరు అదార్ లవ్' నిర్మాత... కోటితో తీసిన చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ రెండు కోట్లట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొండెక్కి కూర్చున్న 'ఒరు అదార్ లవ్' నిర్మాత... కోటితో తీసిన చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ రెండు కోట్లట!

  • ఒక్క కనుగీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్
  • తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం సంప్రదింపులు
  • నిర్మాత చెప్పిన ఎమౌంట్ విని దిమ్మతిరిగిందట!
ప్రియా ప్రకాశ్ వారియర్... ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కేరళ సుందరి. ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్'లోని ఓ పాట టీజర్ విడుదల కాగా, రాత్రికి రాత్రే నెట్టింట స్టార్ గా మారిపోయిన అమ్మాయి. ఇక ఆమెకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయాలని భావించిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు 'ఒరు అదార్ లవ్' నిర్మాతలను సంప్రదించగా, ఆయన చెప్పిన ఎమౌంట్ విని దిమ్మతిరిగిందట.

ఈ చిత్రాన్ని కోటి రూపాయల్లోపే నిర్మించిన సదరు నిర్మాత, కొండెక్కి కూర్చుని, కేవలం తెలుగు డబ్బింగ్ హక్కులను విక్రయించేందుకు రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఆపై అంత మొత్తం ఇచ్చేందుకు సదరు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అంగీకరించాడా? అన్నది తెలియలేదు. కాగా, ప్రియకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Priya Prakash
Oru Omer Love
Telugu Dubbing Rights

More Telugu News