గూగుల్ నుంచి జీ మెయిల్ గో యాప్... ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కు రెడీ
- ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వెర్షన్ కు సపోర్ట్
- రెగ్యులర్ వెర్షన్ కంటే తేలికపాటిది
- అన్ని బేసిక్ ఫీచర్లకూ చోటు
- ఇతర మెయిల్ ఐడీలకూ చోటు
జీమెయిల్ కు సంబంధించి బేసిక్ ఫీచర్లన్నింటినీ ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే, జీమెయిల్ తో పాటు ఔట్ లుక్ డాట్ కామ్, యాహూ మెయిల్ ఇతర ఈ మెయిల్ అకౌంట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. జీమెయిల్ గో యాప్ అన్నది తేలిక పాటి వెర్షన్. రెగ్యులర్ జీమెయిల్ యాప్ సైజు 20.66 ఎంబీ కాగా, జీమెయిల్ గో వెర్షన్ 9.51ఎంబీయే. రెగ్యులర్ వెర్షన్ యాప్ 47ఎంబీని వినియోగించుకుంటే, గో వెర్షన్ 25 ఎంబీయే వినియోగించుకుంటుంది.