రూ. 999కే ఏడాది పాటు రోజుకు 1 జీబీ డేటా: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్

  • జియో వచ్చిన తరువాత ముదిరిన టెలికం వార్
  • మరో ఆకర్షణీయ ఆఫర్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్
  • అందుబాటులోకి వచ్చిన 'మ్యాక్సిమమ్'
భారత టెలికం రంగంలోకి జియో ప్రవేశించిన తరువాత, ఆపరేటర్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడిన నేపథ్యంలో, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ మరో బంపరాఫర్ తో ముందుకు వచ్చింది. రూ. 999 రూపాయల రీచార్జ్ తో ఏడాది పాటు (365 రోజులు) రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవచ్చని తెలిపింది. 'మ్యాక్సిమమ్' పేరిట అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాక్ తో ఆరు నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ, అసోం, కశ్మీర్ సర్కిల్స్ సహా ఈశాన్య రాష్ట్రాలలో ఈ ప్లాన్ వర్తించదని స్పష్టం చేసింది.
Go Back to Shorts
BSNL
Jio
Reliance
Maximum

More Telugu News