కర్ణాటకలో బీజేపీని ఢీకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్
- కర్ణాటక ఎన్నికల ప్రచార రంగంలోకి చిరంజీవి
- కనీసం వారం రోజులు ప్రచారం చేయడానికి గ్రీన్ సిగ్నల్
- బీజేపీ మతోన్మాదానికి బ్రేక్ వేస్తామన్న కేపీసీసీ
ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఎన్నో ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవిని ఎన్నికల ప్రచారంలోకి దింపనుంది కాంగ్రెస్. దీనిపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యాధ్యక్షుడు దినేష్ గుండూరావు మాట్లాడుతూ, కనీసం వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చిరంజీవి అంగీకరించారని చెప్పారు. సినీ నటి ఖుష్బూ కూడా ప్రచారం చేస్తారని తెలిపారు. ప్రియాంక గాంధీని కూడా రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని... అయితే, ఇంతవరకు స్పష్టమైన హామీ రాలేదని చెప్పారు. మతోన్మాదమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ దూకుడుకు ఈ ఎన్నికల్లో బ్రేక్ వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.