సెంచరీ చేసి కూడా సంబరాలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ... కారణమిదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install
సెంచరీ చేసి కూడా సంబరాలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ... కారణమిదే!
• దక్షిణాఫ్రికాతో తొలి నాలుగు మ్యాచ్ లలో వైఫల్యం
• ఐదో వన్డేలో అద్భుత రీతిలో సెంచరీ
• ఇద్దరు ఆటగాళ్లు రన్నౌట్ కావడంతో మనస్తాపం
• సంబరాలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ
వరుసగా నాలుగు మ్యాచ్ లలో వైఫల్యం. అభిమానులతో పాటు జట్టు మేనేజ్ మెంట్ నుంచి కూడా ఒత్తిడి. దక్షిణాఫ్రికాతో ఐదో వన్డే ముందు ఓపెనర్ రోహిత్ శర్మ పరిస్థితి ఇదే. ఫామ్ లేమిలో ఉన్న వేళ, అద్భుతంగా ఆడి సెంచరీ సాధిస్తే, ఎవరైనా ఎగిరి గంతులేసి గ్రౌండులో అందరికీ అభివాదం చెబుతారు. కానీ, రోహిత్ శర్మ మాత్రం మామూలుగానే ఉండిపోయాడు. అతనిలో సెంచరీ ఆనందం కనిపించలేదు. తిరిగి బ్యాటింగ్ లో నిమగ్నమయ్యాడు.
ఎందుకని అలా చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని మీడియాకు వెల్లడించిన రోహిత్, తన కళ్లముందే ఇద్దరు కీలక ఆటగాళ్లు రన్నౌట్ అయ్యారని, తప్పు ఎవరిదైనా, వారి రన్నౌట్ లో తనకూ భాగస్వామ్యముందని చెప్పాడు. అందుకే సెంచరీ తరువాత సంబరాల ఆలోచన తన మనసులోకి రాలేదని అన్నాడు. ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నామన్న విషయంపైనే సంబరాలు ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చాడు.
Happy Valentine’s Day Rits ❤️ @ritssajdeh
A post shared by  Rohit Sharma (@rohitsharma45) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2018-02-14T01:48:54+00:00">Feb 13, 2018 at 5:48pm PST</time>
Rohit Sharma
India
South Africa
Cricket
Century
More Telugu News