సుష్మాస్వరాజ్ నాయకత్వాన్ని మెచ్చుకున్న ప్రధాని మోదీ... ట్విట్టర్ లో బర్త్ డే విషెస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుష్మాస్వరాజ్ నాయకత్వాన్ని మెచ్చుకున్న ప్రధాని మోదీ... ట్విట్టర్ లో బర్త్ డే విషెస్

  • అసాధారణ నేతగా ఎదిగారు
  • విదేశాంగ విధానంలో ఆమెది కీలక పాత్ర
  • ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలంటూ ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచర మంత్రి సుష్మాస్వరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ ట్విట్టర్లో  ట్వీట్ చేశారు. ‘‘సుష్మాస్వరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆమె తనను తాను ఓ అసాధారణ నేతగా తీర్దిదిద్దుకున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా భారతదేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఆమెది కీలక పాత్ర. చురుకైన, పరోపకార స్వభావంతో అంతర్జాతీయంగా భారతీయులకు సన్నిహితంగా మారారు. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. దీనికి సుష్మ సైతం ట్విట్టర్ వేదికపైనే స్పందించారు. ‘మీరు మెచ్చుకున్న తీరుకు ధన్యవాదములు’ అని పేర్కొన్నారు.
Narendra Modi
sushma swaraj

More Telugu News