సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి... 24 గంటలు దాటినా ఉగ్రవాదులను మట్టుబెట్టలేకపోతున్న సైన్యం!
- నిన్న క్యాంపులో చొరబడిన ఉగ్రవాదులు
- వారి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు
- కొనసాగుతున్న ఎన్ కౌంటర్
సోమవారం నాడు ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ క్యాంపులోకి చొరబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారిని నిలువరించేందుకు ఓ జవాను కాల్పులు జరిపి గాయపడ్డాడు. టెర్రరిస్టుల వద్ద ఏకే-47తో పాటు ఆయుధాలు కూడా ఉన్నట్టు తెలుస్తుండగా, వారు దాగున్న భవంతి చుట్టూ భారీ ఎత్తున పోలీసులు, సైన్యం మోహరించారు. అప్పుడప్పుడూ కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్ కౌంటర్ ను సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.