కర్ణాటక సీఎం పీఠానికి భారీ డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటక సీఎం పీఠానికి భారీ డిమాండ్

కర్ణాటకలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ ఖాయమైంది. ఇక సీఎం పీఠం ఎవరిది? అన్న ప్రశ్న మొదలైంది. ఇందుకోసం చాలా మంది నేతలు పోటీపడుతున్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే పోటీలో ముందంజలో ఉన్నారు. ఓబీసీ నేతగా సిద్ధరామయ్య సీఎం పీఠానికి బలమైన అభ్యర్థిగా ప్రచారం నడుస్తోంది. రెండు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం. నిన్నటి వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే, 2006లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి కావడం ఒక్కటే మైనస్ పాయింట్.

చాలా సీనియర్ నేతల్లో ఒకరైన మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి కుర్చీపై ఆశలు పెట్టుకున్నారు. అవసరమైతే సీఎం పదవి స్వీకరించడానికి సిద్దమేనని ప్రకటించారు. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, లింగాయత్ వర్గానికి చెందినవాడు కావడం, రెండు సార్లు ప్రతిపక్షనేతగా, కర్ణాటక పీసీసీ నేతగా పనిచేసిన అనుభవం ఈయనకు సానుకూలాంశాలు.

వీరితోపాటు జి.పరమేశ్వర పేరు కూడా వినిపిస్తోంది. ఇక అవసరమైతే కేంద్ర మంత్రిగా ఉన్న వీరప్ప మెయిలీ కూడా రంగంలోకి రావచ్చంటున్నారు. ఈయన లోగడ సీఎంగా పనిచేశారు. మరో్ మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. ఎంతమంది పోటీపడ్డా అధిష్ఠానానికి విధేయుడినే కాంగ్రెస్ ఎంపిక చేస్తుందన్నది వాస్తవం.

More Telugu News