సెర్బియా అమ్మాయితో చెస్ స్టార్ హరికృష్ణ ప్రేమ వివాహం... మీడియాకు ప్రేయసి ఫొటో విడుదల!

  • మార్చి 3న పెండేల హరికృష్ణ వివాహం
  • సెర్బియా చెస్ స్టార్ నదెడ్జాతో ప్రేమ పెళ్లి
  • హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో వివాహం
భారత చదరంగ దిగ్గజం, గ్రాండ్‌ మాస్టర్‌ పెండేల హరికృష్ణ ఓ ఇంటి వాడు కానున్నాడు. అతని పెళ్లికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చెస్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన వేళ, తనకు పరిచయం అయిన సెర్బియా చెస్‌ క్రీడాకారిణి నదెడ్జాను తాను వివాహం చేసుకోనున్నట్టు హరికృష్ణ మీడియాకు తెలిపాడు. మార్చి 3వ తేదీన హైదరాబాద్‌ లోని నోవాటెల్‌ హోటల్ లో తమ పెళ్లి జరుగుతుందని చెప్పిన ఆయన, తనకు కాబోయే భార్య ఫొటోతో కూడిన వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మీడియాకు విడుదల చేశాడు. ఈ పెళ్లికి పలువురు వీఐపీలు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు.
Go Back to Shorts
Chess
Harikrishna
Serbiya
Marriage

More Telugu News