హైదరాబాద్ లో బాలీవుడ్ హీరో' ఇమ్రాన్ హష్మీ.. అభిమానులు చుట్టుముట్టడంతో కారు దిగకుండానే వెళ్లిపోయిన వైనం!
- టోలీచౌకీలో షోరూం ప్రారంభించేందుకు వచ్చిన ఇమ్రాన్ హష్మి
- అభిమానుల తాకిడిని నియంత్రించలేకపోయిన బౌన్సర్లు
- ప్రారంభించకుండానే వెనక్కు వెళ్లిపోయిన హీరో
గత రాత్రి 8.30 గంటల సమయంలో కారులో మాల్ ఆవరణకు ఇమ్రాన్ రాగా, అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో చేరిన అభిమానులు ఆయన్ను దగ్గరి నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. ఆయనతో సెల్ఫీ దిగాలని, కరచాలనం చేయాలని భావిస్తూ కారు చుట్టూ ఎగబడ్డారు. వారిని నియంత్రించడం బౌన్సర్ల వల్ల కాలేదు. ఆపై మాల్ లోకి వచ్చేందుకు నిరాకరించిన ఇమ్రాన్ స్టోర్ ఇనాగరేషన్ లో పాల్గొనకుండానే వెనుదిరిగి పోయారు. ఆయన కారును అతికష్టం మీద మాల్ ను దాటించగలిగారు బౌన్సర్లు.