అతన్ని నేను కొట్టినట్టు నిరూపిస్తే నా యావదాస్తినీ మీకు ఇచ్చేస్తాను: మోహన్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అతన్ని నేను కొట్టినట్టు నిరూపిస్తే నా యావదాస్తినీ మీకు ఇచ్చేస్తాను: మోహన్ బాబు

  • ఆ దర్శకుడిని నేను కొట్టలేదు 
  • అవసరమైతే ఆయనతోనే చెప్పించండి 
  • నా దృష్టిలో దర్శకుడు ఓ రథసారథి
మోహన్ బాబు కోపిష్టి అని ఆయన గురించి విన్నవాళ్లు అంటారు .. ఆ కోపానికి అర్థం ఉంటుందని సన్నిహితులు చెబుతారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ ఉండగా కూడా ఆయన కోపాన్ని గురించిన ప్రస్తావనే వచ్చింది. " కొంతమంది దర్శకుల పట్ల మీరు చాలా హార్ష్ గా బిహేవ్ చేశారనే టాక్ వుంది .. అది వాస్తవమేనా ?" అనే ప్రశ్న మోహన్ బాబుకు ఎదురైంది.

అందుకు మోహన్ బాబు స్పందిస్తూ 'వాళ్లలో ఓ దర్శకుడి పేరు చెప్పండి' అన్నారు. 'దర్శకుడు సూర్యకిరణ్ పై మీరు చేయి చేసుకున్నారట?' 'ఈ రోజున సూర్య కిరణ్ ఆ మాట చెబితే మీకు నా యావదాస్తిని ఇచ్చేస్తాను. ఒకవేళ సూర్య కిరణ్ అలాంటిదేం లేదంటే మీరేమిస్తారో చెప్పండి' అన్నారు. "ఇలాంటివన్నీ మూర్ఖులు అనుకుంటూ వుంటారు .. బుర్ర పనిచేయని వాళ్లు అనుకుంటారు. నా దృష్టిలో దర్శకుడు .. రథసారథి వంటివాడు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.    

mohan babu

More Telugu News